2 May, 2026 | 12:09 AM

మండలాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి

01-05-2026 10:53 PM

మండల ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు 

కుభీర్,(విజయక్రాంతి)మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నిలిపేందుకు ఎన్నో విధాల కృషి చేస్తున్న ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి అభినందనీయుడని బీఆర్ఎస్మండల అధ్యక్షుడు  ఎన్నిల అనిల్ పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రం లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా  మండల పంచాయతీ కార్యదర్శులు ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన పలువురు ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల ప్రతినిధులు ఆయన పనితీరుపై ప్రశంసలు కురిపించారు. పంచాయతీ ఎన్నికలు, శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్న మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి మరమ్మతులు చేపట్టి నూతనంగా నిర్మించిన కార్యాలయంలా లక్షలు వెచ్చించి ప్రజలందరూ మెచ్చుకునేలా ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించి ఎక్కడ లోటుపాట్లు జరగకుండా  ఆయన చేసిన సేవలను కొనియాడారు.