2 May, 2026 | 12:11 AM

ఘనంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ శంకుస్థాపన

01-05-2026 10:55 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శివాలయంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణానికి శుక్రవారం ఆలయ పూజారి కొంపెల్లి కృష్ణశాస్త్రి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామస్తుల సహకారంతో నూతనంగా నిర్మించనున్న ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవాన్ని గ్రామస్తులు పూజారులు ఘనంగా నిర్వహించారు. మొదట ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.గ్రామంలోని గ్రామస్తులందరూ కలిసి ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని ఆలయ పూజారి గ్రామ పురోహితులు కొంపెల్లి కృష్ణ శాస్త్రి తెలిపారు.