విద్యార్థులకు చదువే లక్ష్యం కావాలి
కలెక్టర్ స్నేహ శబరిష్
మహబూబాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్య కీలక దశ అని, చదువే లక్ష్యం కావాలని, చదువుతోపాటు క్రీడల్లో రాణించడానికి కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ విద్యార్థులకు ఉద్బోధించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ (బా లుర) జూనియర్ కళాశాలను గురువారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల అడ్మిషన్ల వివరాలు అడిగి తెలుసుకు న్నారు. అడ్మిషన్లు, విద్యార్థుల హాజరు శాతం పెంచాలన్నారు.
శిథిలావస్థలో ఉన్న పాత భవనాన్ని కూల్చే విధంగా చర్యలు చేపట్టాలని, కళాశాలలోని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షాలు కురిసిన సందర్భంలో కళాశాల ఆవరణలో నీరు చేరుతున్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి ప్రిన్సిపాల్ తీసుకెళ్లగా వెంటనే స్పందించి నీరు చేరుతున్న ప్రదేశంలో సంపు ఏర్పాటు చేసి మోటార్ ద్వారా ఆ నీటిని బయటికి పంపించవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా విద్యార్థులకు మంచినీటి సమస్యని గురించి వారి దృష్టికి తీసుకెళ్లగా ఆర్వో ప్లాంట్ ను వెంటనే బాగు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాబార్డు నిధులతో త్వరలో ఎడ్యుకేషన్ హబ్ మంజూరు కాబోతుందని అంతవరకు ప్రస్తుతం ఉన్న గదులలో తరగతులు నిర్వహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి మదార్ గౌడ్, కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ డీపీ గణేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అరుణ్ కుమార్, కళాశాల అకడమిక్ ఆఫీసర్ నయీమ్ పాష, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి సురేందర్, అధ్యాపకులు షాహిద్, నాగిరెడ్డి, అప్పారావు, సుశీల, శివ, అయేషా, సారయ్య, బాలరాజు, రాజశేఖర్, లైబ్రేరియన్ హాలు పాల్గొన్నారు.
ఘనంగా వన మహోత్సవం
వన మహోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభించారు. 43.లక్షల 51వేల మొక్కలను జిల్లా వ్యాప్తంగా నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ఎస్పీ డాక్టర్ శబరిష్, డిఎఫ్‌ఓ విశాల్ బత్తుల గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జామండ్లపల్లిలో వన మహోత్సవం ప్రారంభించి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన మొక్కల లక్ష్యాలను చేరుకోవాలని పచ్చదనం, పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు, జిల్లాలో శాఖల వారీగా వన మహోత్సవం లక్ష్యాలు వ్యవసాయ 1లక్ష, 60 వేల మొక్కలు, బీసీ వెల్ఫేర్ 5వేలు, పంచాయతీరాజ్ 30 వేలు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ 31 లక్ష 40 వేలు , ఎక్సైజ్ 60 వేలు, ఫారెస్ట్ 4. లక్షల 50 వేలు, మెడికల్ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ 5 వేలు, హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ 1 లక్ష 30 వేలు, పరిశ్రమల శాఖ 7 వేలు, ఇంటర్ కాలేజ్ ఎడ్యుకేషన్ 3 వేలు, ఇరిగేషన్ 11 వేలు, మైనారిటీ వెల్ఫేర్ 5 వేలు, మున్సిపల్ అథారిటీస్ 2. లక్షల 50 వేలు, పోలీస్ 60 వేలు, రోడ్లు భవనాల శాఖ 10 వేలు, పాఠశాల విద్యాశాఖ 15 వేలు, గిరిజన సంక్షేమ శాఖ ఐటీడీఏ 10 వేలు, మొత్తం 43 లక్షల 51 వేల మొక్కలను నాటి లక్ష్యం పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.






