20 July, 2026 | 12:00 AM

జిల్లాలో శాశ్వత విద్యాశాఖ అధికారులను నియమించాలి

19-07-2026 02:33 PM

భూపాలపల్లి, జూలై19.విజయక్రాంతి: జిల్లాలో శాశ్వత జిల్లా విద్యాశాఖ అధికారి, అన్ని మండలాల్లో శాశ్వత మండల విద్యాశాఖ అధికారులను వెంటనే నియమించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఆదాయ అధికారికి వినతి పత్రం సమర్పించారు.

జిల్లాలో ప్రస్తుతం ఇన్‌చార్జి వ్యవస్థ కొనసాగుతున్నందున విద్యా వ్యవస్థ దెబ్బతింటోందని ఆయన తెలిపారు. మండలాల్లో సీనియర్ ఉపాధ్యాయులను అదనపు బాధ్యతలతో నియమించడం వల్ల పాఠశాలలపై పర్యవేక్షణ లోపిస్తున్నదని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలపై నియంత్రణ లేకపోవడం, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత తగ్గడం వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. వెంటనే శాశ్వత అధికారులను నియమించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాసాల శ్రావణ్ కుమార్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.