10-02-2026 02:12:49 AM
కోదాడ, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోమవారం ఏకకాలంలో మెరుపు దాడు లు నిర్వహించారు. పట్టణానికి చెందిన వ్యాపారవేత్త నీలా సత్యనారాయణ వద్ద ఆదాయానికి మించిన ఆస్తు లు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కోదాడ పట్టణంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కలిపి ఆరు చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
సత్యనారాయణ బంధువుల ఇళ్లలో, కార్యాలయాల్లో తనిఖీలు చేసినట్టు తెలుస్తోంది. నీలా సత్యనారాయణకు సంబంధించి కిట్స్ కళాశాల, రైస్ మిల్లులు, ఇతర వ్యాపార సంస్థల్లో అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న అనుమానాలతో ఈడీ అధికారులు పలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లను స్వాధీ నం చేసుకున్నట్లు సమాచారం.
పన్ను ఎగవేత, అక్రమ పెట్టుబడులపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిసింది. సీఎంఆర్ రైస్ గోల్‌మాల్ కేసు, గతంలో సీఎం ఆర్ రైస్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు సత్యనారాయణపై ఉన్న సంగతి తెలిసిందే. అదే కోణంలో తాజా దాడులు జరుగుతున్నాయా? అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.