జర్మనీకి షాకిచ్చిన ఈక్వెడార్
27-06-2026 12:06 AM
20 ఏళ్ల తర్వాత నాకౌట్‌కు క్వాలిఫై
న్యూయార్క్, జూన్ 26: సాకర్ ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన జర్మనీకి ఈక్వెడార్ షాకిచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఈక్వెడార్ 2 గోల్స్ తేడాతో జ ర్మనీపై విజయం సాధించింది. ఈ విజయంతో ఈక్వెడార్ నాకౌట్‌లో అడుగుపెట్టింది.
మ్యాచ్ 2వ నిమిషంసోనే లిరో సాన్ గోల్ చేసి జర్మనీకి ఆధిక్యాన్నందించాడు. అయితే 9వ నిమిషంలో ఈక్వెడార్ ప్లేయర్ నిల్సన్ గోల్ కొట్టడంతో స్కోరు సమమైంది. తర్వాత 77వ నిమిషంలో గొంజాలో మరో గోల్ కొట్టడంతో ఈక్వెడార్ ఆధిక్యాన్ని 2 పెంచుకుంది. జర్మనీ స్కోరు సమం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.






