27 June, 2026 | 1:14 AM

అమెరికాకు షాకిచ్చిన తుర్కియే

27-06-2026 12:08 AM

లాస్‌ఏంజెల్స్, జూన్ 26: ఫిఫా వరల్డ్‌కప్‌లో చిన్న జట్లు అదరగొడుతున్నాయి. నాకౌట్ రేసు నుంచి తప్పుకున్న తుర్కియే ఆతిథ్య అమెరికాకు దిమ్మతిరిగే షాకిచ్చింది. తన చివరి మ్యాచ్‌లో అమెరికాను 3 గోల్స్ తేడాతో ఓడించింది. విజయంతో టోర్నీని ముగించే లక్ష్యంతోనే తుర్కియే ఆడింది.

3వ నిమిషంలోనే అమెరికా డిఫెండర్ ఆస్టన్ గోల్ కొట్టాడు. కాసేపటికే తుర్కియే స్టార్ గులెర్ కూడా గోల్ చేయడంతో స్కోరు సమమైంది. 31వ నిమిషంలో యిల్మాజ్ చేసిన గోల్‌తో తుర్కియే 2 ఆధిక్యంలో నిలిచింది. 49వ నిమిషంలో అమెరికా స్కోరు సమం చేయగా.. చివరి నిమిషంలో అయ్హాన్ చేసిన గోల్‌తో తుర్కియే సంచలన విజయాన్నందుకుంది.