13 August, 2026 | 1:32 AM

300 కిలోల కల్తీ పన్నీరు సీజ్

13-08-2026 12:09 AM

మల్కాజ్‌గిరి, కంటోన్మెంట్ ఎస్‌ఓటీ టీం, బొల్లారం పోలీసుల దాడి

ఇద్దరు నిందితుల అరెస్టు 

సికింద్రాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజ్గిరి, కంటోన్మెంట్ ఎస్‌ఓటి టీం 2,బొల్లారం పోలీసులు,ఎమ్-ఫాస్ట్ బృందాలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ లో 300 కిలోల నకిలీ పన్నీరు,1 మహీంద్రా సుప్రో ఫోర్ వీలర్ ను స్వాధీనం చేసుకొని,ఇద్దరు నిందితులను అదుపులో తీసుకున్నారు.

కంటోన్మెంట్ ఎస్‌ఓటి టీమ్ తెలిపిన వివరాల్లోకి వెళ్తే మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన అసిటిక్ యాసిడ్, మైదా,పాల పౌడర్,ఇతర నిషేధిత రసాయనాలను ఉపయోగించి కల్తీ పన్నీర్ను తయారు చేసిన ప్రజలకు విక్రయిస్తూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్న జగదేవ్పూర్ (సిద్దిపేట జిల్లా),వట్టిపల్లి గ్రామానికి చెందిన తాడూరి నరేందర్ రెడ్డి అలియాస్ నవీన్ (40,తండ్రి: రవీందర్ రెడ్డి, ఇ.నెం: 2-56/2) మరియు గడ్డం హరి కిషన్ (29, తండ్రి: అయ్యపు రెడ్డి)లను కంటోన్మెంట్ ఎస్‌ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ దాడిలో నిందితుల వద్ద నుంచి 300 కిలోల కల్తీ పన్నీర్తో పాటు దాని రవాణాకు ఉపయోగిస్తున్న మహీంద్రా సుప్రో వాహనాన్ని (రిజిస్ట్రేషన్ నంబర్ టిఎస్ 36 టిఏ 5410 ) స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి, భారతీయ నన్యాయ సంహిత సెక్షన్లు 223, 274, 275 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.