22 July, 2026 | 2:35 AM

బీఆర్‌ఎస్ కమీషన్లతోనే నేడు కరువు

22-07-2026 12:27 AM

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): బీజేపీ, బీఆర్‌ఎస్ నేతల వ్యవహారం దొంగనే దొంగా అన్న చందంగా ఉన్నదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతిరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడారు.  బీఆర్‌ఎస్ నాయకుల తీరు ‘దొంగనే దొంగా అని అరుస్తున్నట్లుగా‘ ఉందన్నారు. 

ఓట్ల రాజకీయాల నుంచి ప్రజాస్వామ్య విలువల వరకు ప్రతి విషయంలో బీజేపీ ‘చోరీ రాజకీయాలు‘ చేస్తోందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాలే ప్ర స్తుతం సమస్యలకు కారణమయ్యాయన్నారు. కమీషన్ల కోసం ప్రాజెక్టుల రూపకల్పన, అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే నేడు రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలను విస్మరించి నీటి విడుదలపై ఒత్తిడి తేవడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు.