కలుషిత నీరే తాగునీరు.. రోగాల బారిన పడుతున్న ప్రజలు
మిషన్ భగీరథ నీలు అందించి తాగు నీరు సమస్య పరిష్కరించలి
సీపీఎం పార్టీ మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు
ఎర్రుపాలెం,(విజయక్రాంతి): తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న వారే లేకుండా పోయాడని, వెంటనే సమస్య పరిష్కరించాలని ఎర్రుపాలెం మండలం మామునూరు* గ్రామపంచాయతీ కార్యాలయo వద్ద గ్రామస్తులు సీపీయం పార్టీ అద్యర్యంలో ఆందోళన నిరసన కార్యక్రమo నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీయం పార్టీ మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు మాట్లాడుతూ తాగు నీరు సరఫరా కావడం లేదని, ఒకవేళ సరఫరా చేసినా కలుషిత నీరే వస్తున్నయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో మిషన్ భగీరథ నీరు వచ్చేవని గత ఎనిమిది నెలలుగా మిషన్ భగీరథ నీరు పూర్తిగా ఇవ్వకుండా తాగునీటి సమస్యకి కారకులయ్యారని మర్శించారు. పశువులు సేద తీర్చుకునే మామునూరు పేట చెరువు నీటిని శుద్ధి చేయకుండా డైరెక్ట్ గా గ్రామ ట్యాంకు ఎక్కించి ఆ నీరుని ప్రజలకు అందిస్తున్నారని ఈ నీటిలో జలగాలు,పాచి, బురద మురుగుతో నీరు రంగు మారి దుర్వాసన వస్తున్న ఈ కలుషిత నీరు తాగడం, అవసరాలకు ఉపయోగించటం వల్ల జీవకోస సమస్యలతో పాటు చర్మ వ్యాధులు వస్తున్నాయి.
వేలాది రూపాయలతో వైద్యం చేయించుకున్న మల్ల మల్ల అనారోగ్య సమస్య పునరావృతం అవుతుందని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం,ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వీడి స్వచ్ఛమైన సురక్షితమైన తాగునీరు అందించాలని లేనిపక్షంలో ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. తాగు నీరు సమస్య వెంటనే పరిష్కరించాలని గ్రామ సర్పంచ్ షేక్ పెద్ద బాబు సాహెబ్ , ఉప సర్పంచ్ మారబత్తుల ఆదిలక్ష్మి,పంచాయతీ కార్యదర్శి నరేంద్ర రెడ్డి* కి గ్రామస్థుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.






