యూత్ నేషనల్ వాలీబాల్ రిఫరీగా డాక్టర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి
10-03-2026 08:12 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఈనెల 15వ తేదీ నుండి 20 వరకు నిర్వహించనున్న యూత్ నేషనల్ వాలీబాల్ చాంఫియన్ షిప్ కు డాక్టర్ ఎం. శ్రీనివాసరెడ్డి రిఫరీగా వ్యవహరిస్తున్నారు. ఈటోర్నమెంట్ క్రీడలు ఒరిస్సా రాష్ట్రo భువనేశ్వర్ లోని క్రిట్స్ యూనివర్సిటీలో జరుగుతాయి. ఈసందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ ఎన్. గౌతంరావు, సెక్రటరీ డాక్టర్ జి. మనోహర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.ఎస్. శ్రీనివాసు అభినందించారు. ఈటోర్నమెంట్ కు వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అధికారిక ఉత్తర్వలు వచ్చాయని డాక్టర్ ఎం. శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.




