2 March, 2026 | 9:08 PM

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన డాక్టర్ కోట నీలిమ

02-03-2026 07:28 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి మంచిస్థాయికి చేరుకోవాలని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. సోమవారం సనత్ నగర్ డివిజన్ లో సీనియర్ నాయకుడు ప్రమోద్ తండ్రి నాగభూషణం, సోదరుడు బాలరాజ్ జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు.

సమాజంలో జీవితాలను మార్చేది చదువేనన్నారు. చదువు చాలా గొప్పదని.. దానికి కులం, మతం, జాతి అనే తేడాలు ఉండవని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు బాగా చదువుకొని అందరి మన్ననలు పొందాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఇలాగే దాతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్ తదితర నాయకులు పాల్గొన్నారు.