దోశ.. పూరి.. మిల్లెట్ ఇడ్లీ
- ఇంటర్ విద్యార్థులకు పోషకాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్
- మధ్యాహ్న భోజనం కూడా..
- జూన్ 12న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
- 1.92 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): దోశ.. పూరి.. మిల్లెట్ ఇడ్లీ.. బోండా.. ఉప్మా.. ఇవి హోటల్ మెనూ కాదు.. ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న బ్రేక్ ఫాస్ట్. చట్నీ, సాంబర్, మిక్స్ వెజిటబుల్ కుర్మాతో కూడిన అల్పాహారం అందనుంది. కీలకమైన ఇంటర్ దశలో విద్యార్థులకు పోషకాలతో కూడిన బలవర్ధక ఆహారం అందిం చాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఈ మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచి బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేసేందుకు అధికారు లు చర్యలు చేపట్టారు. దీంతో పాటు మధ్యా హ్న భోజనం కూడా అందించనున్నారు. ఫలితంగా దేశంలోనే తొలిసారి ఇంటర్ విద్యా ర్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించనున్న తొలి రాష్ట్రంగా నిల వనుంది.
ఇంటర్ విద్యార్థులకే ఎందుకు..
జూనియర్ కళాశాలలు మండల కేంద్రా లు, పట్టణాల్లోనే ఉండడంతో మారుమూల ప్రాంతాల విద్యార్థులు కాలేజీకి వెళ్లడం కష్టమవుతోంది. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేసే పరిస్థితి లేకపోవడం, అలాగే మధ్యాహ్న భోజనం తీసుకెళ్లేందుకు సమయం లేకపోవడంతో అర్ధాకలితో ఇబ్బంది పడుతున్నారు. ఈక్రమంలోనే చాలామంది చదువుకు దూరమవుతు న్నారు. దీనికి తోడు ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో అత్యధికులు బల హీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారే. పదో తరగతి చదివిన ప్రతి విద్యార్థి ఇంటర్ పూర్తి చేసేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నారు.
జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సులకు అనుగుణంగా..
ఇంటర్ విద్యార్థుల వయస్సు 15 నుంచి 18 ఏళ్ల మధ్య ఉంటుంది. ఇది కౌమార దశ. శారీరకంగా, మానసికంగా ఎదిగే సమయం. ఈ వయస్సులో వారికి పోషకాలతో కూడిన ఆహా రం అవసరం. జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సుల ప్రకారం.. కౌమార దశలోని వారికి రోజుకు 1029 కిలో కేలరీలు, -30 గ్రాము ల ప్రొటీన్ అవసరం. ఆ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు తగినంతగా పోషకాలు అందించేలా బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకానికి రూపకల్పన చేసింది. అంతేకాకుండా విద్యార్థులంతా ఒకే చోట కలిసి కూర్చొని భోజనం చేయడం వల్ల సామాజిక, ఆర్థిక అసమానతలు తగ్గి, వారి మధ్య స్నేహపూరిత వాతావరణం ఏర్పడుతుందన్నది ప్రభుత్వ ఆలోచన.
మొదటి రోజు 64 కళాశాలల్లో..
బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి జూన్ 12వ తేదీన ప్రారంభిస్తారు. తొలి రోజు 64 కళాశాల్లో 41,250 మంది విద్యార్థులు ఈ పథకంలో భాగస్వాములవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తిస్థాయిలో తరగతులు ప్రారంభమైన తర్వాత ఫస్టియర్, సెకండియర్ కలిపి రోజుకు 1.92 లక్షల మందికి లబ్ధి చేకేరూ అవకాశం ఉంటుంది. ప్రతి ఏటా బ్రేక్‌ఫాస్ట్‌కు రూ.80 కోట్లు, మధ్యాహ్న భోజనానికి రూ.100 కోట్లు ప్రభుత్వం కేటాయించనుంది.
బ్రేక్‌ఫాస్ట్ మెనూ
తొలి రోజు: దోశ, చట్నీ
రెండో రోజు: మిల్లెట్ ఇడ్లీ, సాంబార్
మూడో రోజు: పూరీ, మికస్డ్ వెజిటెబుల్ కుర్మా
నాలుగో రోజు: బోండా, చట్నీ
అయిదో రోజు: చట్నీతో ఇడ్లీ
ఆరో రోజు: చట్నీ, సాంబార్‌తో ఉప్మా
రోజు విడిచి రోజు 150 ఎం.ఎల్ పాలు వీటికితోడు మరింత పోషకాలు అం దించే వివిధ ఆధార పదార్థాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. వీటిపై త్వరలోనే స్పష్టం వచ్చే అవకాశం ఉంది.






