12-02-2026 02:23:53 AM
గోండ్వాన సంక్షేమ పరిషత్..
వెంకటాపురం(నూగూరు), ఫిబ్రవరి 11(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నం సరైన పద్ధతి కాదని గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి విమర్శించారు. బుధవారం సోషల్ మీడియా వేదిక గా ఆయన మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే విధంగా ప్ర యత్నాలు చేస్తున్నారని వారి హక్కులను కో ల్పోయే విధంగా చట్టాలను రూపొందిస్తూ,
కార్మికులకు కేంద్రం తీరని అన్యా యం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్ కొత్త చట్టాలను రూపొందిస్తూ దుర్మార్గమైన ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవరిస్తుందని ఎద్దేవా చేశారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వకుండా గంట పని వ్యవధి పెంచడం సరైన పద్ధతి కాదని అన్నారు.12 న జరగబోయే కార్మిక దేశవ్యాప్త సాార్వత్రిక సమ్మెకు గొండ్వాన సంక్షేమ పరిషత్ పూర్తి మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు.