7 April, 2026 | 3:44 AM

ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం

07-04-2026 12:00 AM

ఎమ్మెల్యే తల్లిదండ్రులు, సోదరి అందజేత

నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): తాండూరు త్రిలింగ రామేశ్వర దేవాలయం అభివృద్ధి నిమిత్తం దేవాలయ ట్రస్ట్కు  లక్ష రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సోదరి శోభ, తల్లిదండ్రులు వజ్రమ్మ రాజేశ్వరరావు దంపతుల చేతుల మీదుగా సోమవారం అందజేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే తల్లిదండ్రులకు సోదరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తల్లిదండ్రులు వజ్రమ్మ, రాజేశ్వరరావులు దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోరిన కోరికలు తీర్చే మహీ మాన్విత్వముగల దేవాలయం సందర్శించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు,ఆలయ అభివృద్ధిలో తమ వంతు పాత్ర కూడా పోషిస్తామని ఆలయము విశ్వవ్యాప్తంగా  తెలిసే విధంగా  తమ వంతు సహకరిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులకు వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాద గౌడ్, ఉప సర్పంచ్ అభిషేక్, ఆలయ కమిటీ అధ్యక్షులు కొమ్మ దత్తు, కోశాధికారి రమేష్, కమిటీ సభ్యులు వేముల సంగయ్య, వార్డ్ మెంబర్లు తలకొక్కుల సత్యనారాయణ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.