20 June, 2026 | 8:27 PM

Breaking News

సింగరేణి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: జి ఎం షాలెం రాజు..   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదు   •   మత్తు రహిత పటిష్ట సమాజ నిర్మాణానికి యోగ ఒక్కటే మార్గం   •   గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టి కృషి   •   ఉద్యాన పంటల సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరించాలి   •   అధిక సాంద్రత పత్తి సాగులో న్యూమాటిక్ ప్లాంటర్‌తో విత్తనాల విత్తకం ప్రదర్శన   •   డిజిటల్ లిటరసీ, ఏఐ నైపుణ్యంతో ఉజ్వల భవిష్యత్తు   •   రాజీ మార్గమే రాజమార్గం: సీనియర్ సివిల్ జడ్జి కే.సురేష్   •   రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు   •   లోక్ అదాలత్ రాజీమార్గంలో ఇద్దరు గెలుస్తారు   •  

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీయూ అధికారుల తనిఖీ

07-04-2026 12:00 AM

కామారెడ్డి, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో సోమవారం తెలంగాణ విశ్వవిద్యాలయం,డిచ్పల్లి ఉన్నతాధికారుల బృందం తనిఖీ చేశారు.  యూనివర్సిటీ అకాడమిక్ సెల్ కన్వీనర్ ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్ నేతృత్వంలోని బృందం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన కళాశాల విద్యా ప్రమాణాలను,విభాగాల వారీగా రికార్డులను పరిశీలించారు.ఈ తనిఖీలో భాగంగా విద్యార్థుల హాజరు పట్టికలు, అధ్యాపకుల టీచింగ్ డైరీలు, ఆయా విభాగాల వార్షిక ప్రణాళికలు, విద్యార్థుల ఉత్తీర్ణత రికార్డులను అధికారులు తనిఖీ చేశారు.

కళాశాలలో విద్యాబోధన తీరు తెన్నులు, రికార్డుల నిర్వహణ  పారదర్శకంగా ఉండటం పట్ల ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. విద్యా ప్రమాణాలను ఇదే విధంగా కొనసాగిస్తూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి  సంపత్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. విజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.కిష్టయ్య పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ విభాగాల ఆచార్యులు, సహాయ ఆచార్యులు, అధ్యాపక బృందం, సిబ్బంది ఈ తనిఖీ ప్రక్రియలో భాగస్వాములై అధికారులకు రికార్డులను సమర్పించారు.