12 June, 2026 | 4:03 AM

గ్రంథాలయానికి పోటీ పరీక్షల పుస్తకాల అందజేత

12-06-2026 01:36 AM

కోదాడ జాన్ 11: కోదాడ పట్టణంలోని కెఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రంథాలయానికి రూ.పదివేల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను అదే కళాశాలలో ఎకనామిక్స్ అధ్యాపకులుగా పనిచేస్తున్న కేలోత్ సైదులు గురువారం ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ హదాసరాని మాట్లాడుతూ కళాశాలలో చదువుకునే పేద మధ్యతరగతి విద్యార్థులకు ఈ పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు, విద్యార్థులు గ్రంథాలయంలోని పోటీ పరీక్షల పుస్తకాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ చందా అప్పారావు, అధ్యాపకులు మాతంగి యాకోబు, సైదిరెడ్డి, నిర్మలాకుమారి, మొహమ్మద్ రఫీ, రాజు, కేశవర్ధన్, యాదమ్మ, రమా పాల్గొన్నారు.