10 August, 2026 | 2:58 AM

కేసుల దర్యాప్తు వేగవంతం చేయండి

10-08-2026 01:45 AM

నేర నిర్ధారణపై ప్రత్యేక దృష్టి పెట్టండి: జిల్లా ఎస్‌పి జానకి 

మహబూబ్ నగర్ ఆగస్టు 9 (విజయక్రాంతి): పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతంగా చేస్తూ నేర నిర్ధారణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు.  జిల్లాలోని వివిధ సర్కిల్ లలో నందు సంబంధిత ఎస్హెచ్‌ఓలు, కోర్టు డ్యూటీ అధికారులుతో ఆయా కార్యాలయాల్లో ఆదివారం సమావేశాలు నిర్వహించారు.

ఈ సమావేశాల్లో మహబూబ్నగర్ వన్టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్, భూత్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ పాల్గొని, తమ పరిధిలోని పెండింగ్ కేసులు, కోర్టు కేసుల పురోగతి, నేర నిర్ధారణకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడంతో పాటు నేర నిర్ధారణ శాతం పెంచేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని, కేసుల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.