calender_icon.png 20 February, 2026 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒప్పందం చేసుకోవాల్సిందే.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

20-02-2026 12:38:44 PM

వాషింగ్టన్: అణు కార్యక్రమానికి సంబంధించి ఇరాన్ తప్పనిసరిగా ఒప్పందం చేసుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) వెల్లడించారు. లేదంటే పరిస్థితులు మరింత దిగజారుతాయని ఇరాన్(Iran)కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పశ్చిమాసియాలో సైన్యాన్ని మోహరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఒప్పందం చేసుకోలేదంటే మరింత ముందుకు వెళ్తామని ట్రంప్(Trump) స్పష్టం చేశారు. 10 రోజుల్లో దాని ఫలితాన్ని మీరే చూస్తారని ఇరాన్ ను ఉద్దేశించి ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బోర్డ్ ఆఫ్ పీస్ కార్యక్రమంలో ట్రంప్

బోర్డ్ ఆఫ్ పీస్ కార్యక్రమంలో(Board of Peace) పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజా పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. గాజా పునరుద్ధరణకు తొమ్మిది సభ్య దేశాలు అంగీకరించాయని పేర్కొన్నారు. రూ. 63 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చేందుకు నిబద్ధతతో ఉన్నామన్నారు. బోర్డ్ ఆఫ్ పీస్ కు అమెరికా 10 బిలియన్ డాలర్లు ఇస్తుందని ట్రంప్ హామీ ఇచ్చారు. గాజా శాంతి ప్రణాళికపై ప్రధాని నరేంద్ర మోదీతో(Prime Minister Narendra Modi) మాట్లాడినట్లు ట్రంప్ ప్రకటించారు. గాజా శాంతి ప్రణాళికపై మోదీ ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు.