20 April, 2026 | 5:29 AM

శిశువుకు ప్రాణం పోసిన వైద్యులు

20-04-2026 01:27 AM

ఇల్లందు టౌన్, ఏప్రిల్ 19, (విజయక్రాంతి):  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం నాగరం గ్రామానికి చెందిన నవీన్ కుమారుడు మూడు నెలల అభినేహన్ గుండె స్పందన, శ్వాస లేకుండా అత్యంత క్లిష్ట స్థితిలో ఇల్లందు ఏరియా హాస్పిటల్కు చేరగా డాక్టర్ అజ్మీరా భగత్ సింగ్ వైద్య బృందంతో కలిసి తక్షణమే అత్యవసర చికిత్స ప్రారంభించి మూడు సైకిల్స్ సీపీఆర్ నిర్వహిస్తూ మూడు డోసుల అడ్రినలిన్ అందించి శిశువు గుండె స్పందనను నిమిషానికి 120కు పునరుద్ధరిం చారు.

ఈ సందర్భంగా డాక్టర్ అజ్మీరా భగత్ సింగ్ మాట్లాడుతూ శిశువుకు శ్వాస సౌకర్యం కోసం 3.5 ఈటీ ట్యూబ్ ద్వారా ఇంట్యూబేషన్ చేసి అంబు బ్యాగ్ సాయం తో శ్వాస అందిస్తూ రక్త ప్రసరణ మెరుగు పడేందుకు డోపమైన్, డోబుటమైన్ మందు లు ప్రారంభించామని తెలిపారు. అనంతరం అంబులెన్స్లో సిరంజి పంప్ ద్వారా నిరంతర పర్యవేక్షణలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి సురక్షితంగా తరలించామని పేర్కొన్నారు. సమయస్ఫూర్తి, సమన్వయంతో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది చేసిన కృషితో మృత్యువు అంచున ఉన్న శిశువుకు ప్రాణం పోవడం విశేషంగా నిలిచింది.