28 May, 2026 | 5:28 AM

ఆందోళన వద్దు.. అండగా ఉంటాం..

28-05-2026 12:00 AM
  1. రైతులకు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ భరోసా
  2. పలు గ్రామాలలో తడిసిన పంటలు పరిశీలన

సదాశివనగర్, మే 27 (విజయక్రాంతి): ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు నష్టం జరగకుండా వారికి అండగా ఉంటామని ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ అన్నారు. బుధవారం సదాశివనగర్ మండలంలో పర్యటించి అడ్లూరు ఎల్లారెడ్డి, ధర్మారావుపేట్ గ్రామాలలోని కొనుగోలు కేంద్రాలలో తడిసిన వరి పంటను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు  తరలించిన వరి ధాన్యం తరలింపులో జాప్యం జరగడం వలన మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిసిపోయిందని రైతులు  తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ అకాల వర్షంతో తడిసిన పంట వివరాలను మరియు త్వరితగతిన కొనుగోలు కేంద్రాల నుండి తరలించేలా జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతానని చెప్పారు. రెండు రోజులలో తరలింపు పూర్తిగా చేపట్టకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడుతామన్నారు. ఆయన వెంట మాజీ జెడ్పిటిసి పడగల రాజేశ్వరరావు అడ్లూర్ ఎల్లారెడ్డి సర్పంచ్ ఎడ్ల నర్సింలు, ధర్మారావుపేట్ సర్పంచ్ ఎస్.కె ఉమర్ సీనియర్ నాయకులు పైడి జనార్దన్ రెడ్డి, డోకూరి రామిరెడ్డి, మాజీ ఎంపీపీ శివకుమార్, అడ్డగుల్ల సురేష్ తో పాటు బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు..