ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే
25-05-2026 06:44 PM
దమ్మపేట,(విజయక్రాంతి): తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక" కార్యక్రమం లో సోమవారం ఇందిరా మహిళా శక్తి వారోత్సవాల సందర్భంగా మండల వ్యాప్తంగా మంజూరు అయిన 29 గ్రామ సమాఖ్య ల భవనాల నిర్మాణంలో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గ శాసన సభ్యులు జారె ఆదినారాయణ గండుగులపల్లిలో భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే విధంగా మండలంలోని మిగిలిన భవనాల భూమి పూజలో స్ధానిక సర్పంచ్, పాలక వర్గ సభ్యులు, గ్రామ సమాఖ్య పాలకవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది. వీరితోపాటు మండల పరిషత్ అభివృద్ధి అధికారి రవీంద్ర రెడ్డి, స్ధానిక ఎపియం జె.సంతోష్ కుమార్, సంబంధిత సి.సి లు, తదితరులు పాల్గొన్నారు.






