బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌ను మార్చొద్దు
జిల్లాకు బుల్లెట్ ట్రైన్ రావడంతో, వ్యాపార, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి
మాజీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య
తుంగతుర్తి, ఆగస్టు 24: హైదరాబాద్ నుండి విజయవాడ బుల్లెట్ ట్రైన్ సూర్యాపేట నుండి వెళ్లే, పాత అలైన్మెంట్ మార్చొద్దు. యధావిధిగా కొనసాగించాలని మాజీ బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. జాతీయ రహదారికీ అనుసంధానంగా గతంలో ఇచ్చినటువంటి బుల్లెట్ ట్రైన్ అలైన్ మెంట్ మళ్ళీ కొత్తగా, మార్చాలనే కేంద్ర ప్రభుత్వ, ఆలోచనను వెంటనే విరామించుకోవాలి. అలైన్ మెంట్ మార్చడం అంటే సూర్యాపేట జిల్లా అభివృద్ధుని అడ్డుకోవడమేనని అన్నారు.
బుల్లెట్ ట్రైన్ అలైన్ మెంట్ సాధన కోసం గత పది రోజులుగా సూర్యాపేట లో నిరాహారా దీక్ష లు జరుగుతున్న కేంద్రప్రభుత్వపెద్దలు కాని. రైల్వే అధికారులు కాని స్పందించకపోవడన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్రప్రభుత్వం వెంటనే స్పందించి జవాబు చెప్పాలని అన్నారు. లేనియెడల బుల్లెట్ ట్రైన్ సాధన సమితిఆధ్వర్యములో పోరాటం ఉదృత్తమవుతాడని అన్నారు. సాధనసమితి ఆధ్వర్యంలో జరిగే పోరాటానికి తుంగతుర్తి బిఆర్‌ఎస్ శ్రేణుల పార్టీ పూర్తి మద్దతు ఉంటందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లానాయకులు గుండగాని రాములుగౌడ్. మాజీసర్పంచ్ వీరోజీ నాయక్.. బల్లెంప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.






