25 August, 2026 | 6:06 AM

శ్రీ చైతన్యలో ఘనంగా ఫ్రెషర్స్ డే

25-08-2026 12:00 AM

ముకరంపుర, ఆగస్టు 24 (విజయ క్రాంతి): నగరంలోని శుభం గార్డెన్స్ లో శ్రీ చైతన్య విద్యా సంస్థల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి మాట్లాడుతూ 2019 ఎప్రిల్ లో 520 మంది విద్యార్ధిని విద్యార్తులతో మొదలు పెట్టి ఈ రోజు 2980 మంది విద్యార్థులతో కరీంనగర్ పట్టణంలో విస్తరించడానికి తొడ్పడిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

అనంతరం ఇంటర్-2026 లో రాష్ట్రస్థాయిలో అత్యున్నత మార్కులు సాధించిన శ్రీ చైతన్య విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ ముద్దసాని సాయి చైతన్యరెడ్డి, డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, డీన్ జగన్ మోహన్ రెడ్డి, కళాశాలల ప్రిన్సిపల్స్, ఎజియమ్, అధ్యాపక, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.