27 April, 2026 | 8:32 PM

గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి

27-04-2026 07:06 PM

తహసిల్దార్ కు వినతి పత్రం అందించిన భాజపా నాయకులు

పాపన్నపేట: గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని సంతకాలు సేకరించి సోమవారం తహసిల్దార్ సతీష్ కుమార్ కు వినతి పత్రం అందజేశామని భాజపా నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ ఆధ్వర్యంలో గోసమ్మన్ అభియాన్ ఆవ్వాన అభియాన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే తహసిల్దార్ కు అందించిన వినతి పత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ లకు పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సంతోష్ చారి, లక్ష్మణ్, భూషణం, భాగేష్, మల్లేష్, శంకర్ గౌడ్, శేఖర్, నరసింహులు, ప్రదీప్, శ్రావణ్, రాజు, కిష్టయ్య తదితరులు ఉన్నారు.