ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డీఎంహెచ్‌ఓ
05-03-2026 02:25 AM
అలంపూర్, మార్చి 4 : మానవపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్‌ఓ డాక్టర్ సంధ్య కిరణ్మయి బుధవారం ఆకస్మికంగా సంద ర్శించారు. ముందుగా ఆమె ఆసుపత్రిలో ప లు రికార్డులను క్షణంగా పరిశీలించారు. అనంతరం డెలివరీల సంఖ్యపై ఆరా తీసి ప్ర భుత్వ ఆసుపత్రిలో ప్రసవాలని సంఖ్య పెం చాలని ఆ దిశగా వైద్య సిబ్బంది గర్భిణీలకు అవగాహన కల్పించాలని సూచించారు. హెల్త్ సూపర్ వైజర్లు సబ్ సెంటర్లను సందర్శించి ఆరోగ్య కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




