1 August, 2026 | 2:57 AM

అమ్మకిచ్చిన మాట చిరకాలం మిగిలిపోతుంది..

01-08-2026 01:56 AM

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సుధీర్స్ జోకర్’. బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఈ చిత్రంలో అభిరామి, మురళీశర్మ, అజయ్ ఘోష్, మురళీధర్‌గౌడ్, రమేశ్ ఇందిరా, విష్ణు ఓయ్ ఇతర కీలక పాత్ర ల్లో కనిపించనున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పీవీ, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో అభిరామి గాయత్రీదేవి పాత్రలో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అభిరామి పోషిస్తున్న క్యారెక్టర్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘అమ్మకు ఇచ్చిన మాట చిరకాలం మిగిలిపోతుంది..’ అంటూ ఈ పోస్టర్‌పై రాసిన క్యాప్షన్ హార్ట్ టచింగ్‌గా ఉంది. అభిరామి పాత్ర మంచి ఎమోషన్స్‌తో ఆకట్టుకోనుంది. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్; సినిమాటోగ్రఫీ: అహ్మద్ షెరీఫ్; ఎడిటర్: ధర్మేంద్ర కాకర్ల; ప్రొడక్షన్ డిజైన్: విఠల్ కోసనం.