31 May, 2026 | 12:41 AM

మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడొద్దు

31-05-2026 12:00 AM
  1. ‘బక్కి’ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
  2. టీడీపీ పుట్టింది తెలంగాణ గడ్డపై.. బలమైన క్యాడర్ ఇప్పటికీ ఉంది
  3.   33 శాతం రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపు 

అమరావతి, మే 30 (విజయక్రాంతి): చారిత్రక నేపథ్యమున్న ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడుజాగ్రత్తగా మాట్లాడాలని ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు సూచించారు. మహానాడులో టీటీడీపీ అధ్యక్షుడు బక్కి నర్సింహులు చేసిన కొన్ని వ్యాఖ్యల ను సీఎం తప్పుబట్టారు. టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డపై అని, అక్కడి ఇప్పటికీ బలమైన క్యాడ ర్ ఉందన్నారు.

మహానాడు విజయవంతంగా నిర్వహించడంపై టీడీపీ సెక్రెటరీలు, జోనల్ ఇన్‌చార్జీలు, ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహానాడు ఘన విజయంగా నిర్వహించడంపై అందరినీ ప్రత్యేకంగా అభినందించారు.

బక్కి వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. తెలంగాణవారు ఎక్కడ ఉన్నా తెలుగుజాతి ఒక్కటే అన్నారు. టీడీపీ ఆవిర్భావం తరువాత తెలంగాణలో సామాజిక న్యాయం, అభివృద్ధికి బాటలు పడ్డాయని చెప్పారు. తెలంగాణలో ఉత్సాహంగా మహానాడు నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. 33 శాతం రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు.