7 April, 2026 | 2:00 AM

టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులను సన్మానించిన జిల్లా బృందం

07-04-2026 12:00 AM

కామారెడ్డి, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): టీఎన్జీవోస్ రాష్ట్ర సంఘం రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకొని టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ముజీబు హుస్సేనీ, నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులను హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎన్జీవోస్ కేంద్ర సంఘం యొక్క పోరాటాల ద్వారానే ఉద్యోగుల హక్కులను సాధించుకోగలుగుతున్నామని రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ఆకాంక్షలను తీర్చడంలో, ఉద్యోగుల హక్కులను సాధించడంలో అలుపెరుగని పోరాటం చేస్తుందని అన్నారు, రాష్ట్ర సంఘం బలంగా ఉండాలంటే జిల్లా సంఘాల సహకారం అవసరమని రాష్ట్ర సంఘం ఇచ్చే ప్రతి పిలుపుకు జిల్లా సంఘాల స్పందిస్తూ ఉద్యోగుల మధ్య ఐక్యతను వివరిస్తూ సంఘం యొక్క కార్యక్రమాలకు జిల్లా శాఖ తరపున సహకారం అందించాలని రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ కోరారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి , జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు, సహా అధ్యక్షులు మామిళ్ల చక్రధర్, కేంద్ర సంఘ బాధ్యులు శివకుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి అబ్దుల్ ఖదీర్, బాన్సువాడ యూనిట్ కార్యదర్శి అజీముద్దీన్ ఉపాధ్యక్షులు రవి, కోశాధికారి అబ్దుల్ రజాక్, పంచాయతీ సెక్రటరీల ఫోరం జిల్లా కార్యదర్శి ప్రవీణ్ , ఇరిగేషన్ శాఖ బాధ్యులు భీమరాజ్ తదితరులు పాల్గొన్నారు.