విద్యార్థులు సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి
విద్యార్థులకు ఆరోగ్య పరీక్షల నిర్వహణపై హార
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా ప్రత్యేక అధికారిని
జిల్లా ప్రత్యేక అధికారిని విజయేంద్ర
కామారెడ్డి,(విజయక్రాంతి): విద్యార్థినిలు మంచి పోషకారాన్ని తీసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారిని విజయేంద్ర అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా దోమకొండ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థినిలతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను ఆరా తీశారు. ప్రతి నెల హెల్త్ చెకింగ్ జరిపిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం పరిశుభ్రమైన వసతి మెరుగైన విద్య వాతావరణం అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. భోజనం చేస్తున్న విద్యార్థినులకు పోషకాహారం ప్రాముఖ్యతను వివరిస్తూ అన్నం తక్కువగా కూరలు, ఆకుకూరలు, పప్పు, గుడ్లు వంటి పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. వండించిన కూరలను పూర్తిగా తినాలని హారాన్ని వృధా చేయకూడదని చెప్పారు.
విద్యార్థులు భోజనం చేసే సమయంలో ఉపాధ్యాయులు వార్డెన్లు ప్రత్యక్షంగా పర్యవేక్షించి ప్రతి విద్యార్థి సరైన మోతాదులో పోషకాహారం తీసుకునేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుంటూ అలాంటి ఘటనలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ వి గిరి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.






