ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి
02-07-2026 12:41 AM
నిజాంసాగర్, జూలై 1(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డా వెంకటీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రి కి ప్రతి రోజు వస్తున్న బయట పేషెంట్ వివరాలు, అందుతున్న సేవలు రక్త పరీక్ష ల వివరాల గూర్చి స్థానిక వైద్యధికారులు ఆయనకు వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లోపల, బయట గల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని అదేషించారు. అయన వెంట స్థానిక వైద్యాధికారి డా రోహిత్ కుమార్ ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.






