9 May, 2026 | 4:32 PM

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు

09-05-2026 02:55 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద సొసైటీ పరిధిలో గల నాగిరెడ్డిపేట గ్రామ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా సహకార అధికారి రామ్మోహన్రావు శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు మాట్లాడుతూ... వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంట చేసిన బస్తాలు వర్షానికి తగలకుండా చూసుకోవాలని సూచించారు. ట్యాబ్ ఎంట్రీ ఎప్పటికప్పుడు 100% ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మౌంటరింగ్ ఆఫీసర్ రాధిక సంఘ సెక్రెటరీ సందీప్ కుమార్ రైతులు ఉన్నారు.