పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో టీకా కార్యక్రమాలను పరిశీలించిన జిల్లా శిశు ఆరోగ్య & టీకాల అధికారి డా.ప్రతాప్
కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లా శిశు ఆరోగ్య, టీకాల అధికారి డా. ప్రతాప్ బుధవారం పాత కొత్తగూడెం, సఫాయి బస్తీ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న సాధారణ టీకా కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా టీకాల నిల్వ, కోల్డ్ చైన్ నిర్వహణ, యూ-విన్ (U-WIN) పోర్టల్‌లో నమోదు వివరాలు, లబ్ధిదారుల హాజరు, వ్యాక్సిన్ వినియోగం, సెషన్ సైట్ నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు. అర్హులైన ప్రతి చిన్నారికి మరియు గర్భిణీ స్త్రీలకు సకాలంలో టీకాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
అలాగే టీకాకరణ కార్యక్రమాల నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు, యూ-విన్ పోర్టల్‌లో వెంటనే ఆన్‌లైన్ నమోదులు పూర్తి చేయాలని, ఎటువంటి పెండెన్సీలు లేకుండా చూడాలని సూచించారు. టీకా ద్వారా నివారించగల వ్యాధుల నియంత్రణలో సాధారణ టీకాకరణ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (CHO) నాగభూషణం, వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. లను సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న సాధారణ టీకాకరణ కార్యక్రమాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా టీకాల నిల్వ, కోల్డ్ చైన్ నిర్వహణ, యూ-విన్ (U-WIN) పోర్టల్‌లో నమోదు వివరాలు, లబ్ధిదారుల హాజరు, వ్యాక్సిన్ వినియోగం, సెషన్ సైట్ నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు. అర్హులైన ప్రతి చిన్నారికి మరియు గర్భిణీ స్త్రీలకు సకాలంలో టీకాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. అలాగే టీకాకరణ కార్యక్రమాల నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు, యూ-విన్ పోర్టల్‌లో వెంటనే ఆన్‌లైన్ నమోదులు పూర్తి చేయాలని, ఎటువంటి పెండెన్సీలు లేకుండా చూడాలని సూచించారు. టీకా ద్వారా నివారించగల వ్యాధుల నియంత్రణలో సాధారణ టీకాకరణ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నాగభూషణం, వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.






