విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
20-03-2026 02:34 PM
లక్ష్మణ్ చందా,(విజయక్రాంతి): వరల్డ్ విజన్ ఆధ్వర్యంల జడ్పిహెచ్ఎస్ లక్ష్మణ్ చందా విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించారు. .. సర్పంచ్ ఓస కవిత రాజు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్... శ్రావణి వరల్డ్ విజన్ మేనేజర్ బ్రహ్మo పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు నాయక్ తదితరులు పుస్తకాలను విద్యార్థులకు అందించారు ఎస్సై మాట్లాడుతూ.. తాను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి వివిధ స్కాలర్షిప్లను ఉపయోగించుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని.... కావున విద్యార్థులు ఇట్టి స్టడీ మెటీరియల్ ని వేసవి సెలవులలో సద్వినియోగపరుచుకొని వచ్చే సంవత్సరం ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లని అందరూ విద్యార్థులు సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు..




