7 August, 2026 | 9:27 PM

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ పంపిణీ

07-08-2026 08:02 PM

తాను చదువుకున్న పాఠశాల కోసం కిషోర్ కుమార్ వితరణ.. 

నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల క్రీడా ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో మండలంలోని బ్రాహ్మణపల్లి వాస్తవ్యులు మన కోసం మనం స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పట్లోళ్ల కిషోర్ కుమార్  శుక్రవారం నాడు  .పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్‌లను బాన్సువాడ రెవెన్యూ డివిజనల్ అధికారి రవీందర్ రెడ్డి చేతుల మీదుగా అందించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు పట్లోల కిషోర్ కుమార్ గని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కాను విద్యనభశించిన పాఠశాల కోసం చేదోడు వాదోడుగా సహకరిస్తున్న కిషోర్ కుమార్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంకు లక్ష్మయ్య, ఎంపీడీవో  శివకృష్ణ, ఎంఈఓవై.తిరుపతి రెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు   వెంకట్రామిరెడ్డి, ఎస్ఐ శివకుమార్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి లాల్ సింగ్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.