7 August, 2026 | 9:12 PM

11వ జాతీయ ఓబిసి మహాసభలో పాల్గొన్న దొగ్గలి శ్రీధర్

07-08-2026 07:59 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): బెంగళూరులో జరిగిన 11వ జాతీయ ఓబీసీ మహాసభ లో కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ పాల్గొని మాట్లాడుతూ ఆగస్టు 7 ఓబీసీల తలరాత మార్చిన రోజు అని అన్నారు. మండల్ కమిషన్ కృషితోనే ఓబీసీలకు రిజర్వేషన్లు వచ్చాయని గుర్తు చేశారు అందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీ  రోజున జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

పార్లమెంటు సమావేశాల్లో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి యాబై శాతం నిధులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళ బిల్లులో ప్రత్యేక బీసీ మహిళా కోట ఏర్పాటు చేయాలని అన్నారు. దేశంలో జరుగుతున్న జనగణలో ఓబిసి కులగణన చేపట్టాలని వారి డిమాండ్ చేశారు. ఆగస్టు 7 మండల్ డేను జాతీయ బీసీల దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.