24 July, 2026 | 5:20 PM

కేటీఆర్ జన్మదిన సందర్బంగా విద్యార్థులకు షూస్, పుస్తకాల పంపిణీ

24-07-2026 04:42 PM

బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రాపోలు నవీన్ కుమార్

నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్ల మండలంలోని వైకుంఠపురం గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారం కేటీఆర్ జన్మదిన సందర్బంగా 30 మంది విద్యార్థిని విద్యార్థులకు షూ మరియు పుస్తకాలు బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రాపోలు నవీన్ కుమార్ పంపిణి చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... కేటీఆర్ తన 50 వ జన్మదినాన్ని ఎలాంటి వేడుకలు నిర్వహించకుండా కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలని పిలునిచ్చారు.

రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులు, అటు రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా ఒక గంభీరమైన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తన 50వ జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారని,ఆ ఖర్చులను తమకు చేతనైన మేరకు సేవా కార్యక్రమాలకు వినియోగించాలని, ఆపదలో ఉన్నవారికి, అవసరమైన వారికి సాయం అందేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం బి.ఆర్.యస్ పార్టీ వైకుంఠపురం సర్పంచ్ బెజ్జం భవాని, యువజన విభాగం నాయకులు పెరుమాళ్ళ సతీష్ కుమార్,తకెళ్ళ నాగార్జున,జీలకర్ర రామస్వామి, అరె శ్రీకాంత్,షేక్ నాగుల్ మీరా, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.