19 May, 2026 | 10:17 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

పాఠశాలలకు సైన్స్ కిట్ల పంపిణీ

20-12-2025 09:22 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): డ్రీమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలో ఎంపిక చేయబడిన పాఠశాలలకు సైన్స్ కిట్లు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి తో కలిసి ఎంపికైన పాఠశాలలకు సైన్స్ కిట్లను అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేందుకు సైన్స్ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులతో ప్రయోగాలు చేయించడం వలన అభ్యాసనా ఫలితాలు చిరస్థాయిగా ఉంటాయని, వార్షిక పరీక్షలలో మరింత ఉన్నత ఫలితాలు సాధించేందుకు దోహదపడతాయని తెలిపారు. పాఠశాలల విద్యార్థులకు సైన్స్ కిట్లను డ్రీమ్ ట్రస్ట్ వారు అందించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రీమ్ ట్రస్ట్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.