తోర్నాలలో రేషన్ కార్డుల పంపిణీ
27-08-2026 11:50 AM
అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు
సిద్దిపేట రూరల్, ఆగస్టు 27: మండలంలోని తోర్నాల(Tornala)గ్రామంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ(Distribution of ration cards) కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు, అధికారులు రేషన్ కార్డులను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జీవన్‌రెడ్డి, సర్పంచ్ ఆర్వేపల్లి పద్మదేవి, గోపీనాథ్‌రెడ్డి, ఉప సర్పంచ్ ప్రవీణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రీక్కల మహేందర్‌రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు గూడ మహిపాల్‌రెడ్డి, నరహరి, వార్డు సభ్యులు చందు, హరినాథ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






