27 August, 2026 | 2:56 PM

మహిళపై పిచ్చి కుక్కల దాడి

27-08-2026 11:42 AM

బోథ్. ఆగస్టు 27(విజయకాంతి): మండల కేంద్రంలో పిచ్చి కుక్కలు దాడులకు((Dog attack) పాల్పడుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో నలుగురు వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. బస్టాండ్ ప్రాంతంలో కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో ఆయనను వెంటనే ప్రభుత్వాసుపత్రికి(Government Hospital) తరలించారు. ఈ సంఘటనను మర్చిపోకముందే గురువారం ఉదయం పిచ్చి కుక్కలు(Dog attack) సాయి నగర్ కాలనీ నుండి వస్తున్న మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గమనించిన వారు వెంటనే ఆమెను ఆసుపత్రి(Hospital)కి తరలించారు. దాడుల వల్ల పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాలలకు పంపించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు వ్యక్తమవుతుంది. గ్రామపంచాయతీ వారు పిచ్చి కుక్కల నుండి కాపాడాలని కోరుతున్నారు.