77 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
13-06-2026 12:56 AM
భిక్కనూర్, జూన్ 12(విజయక్రాంతి): భిక్కనూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం 77 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఎమ్మార్వో సునీత, ఎంపీడీవో కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్, ఉపాధ్యక్షుడు నాగర్తి నరేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, లబ్ధిదారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.






