13 June, 2026 | 2:57 AM

రిజిస్ట్రేషన్లు పునఃప్రారంభించాలి

13-06-2026 01:00 AM
  1. న్యాయబద్ధమైన పట్టా భూములు, 
  2. రిజిస్ట్రేషన్ ప్లాట్లపైవిధించిన ఆంక్షలు ఎత్తివేయాలి
  3. మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి

మేడిపల్లి, జూన్ 12 (విజయక్రాంతి):  న్యాయబద్ధమైన పట్టా భూములు, రిజిస్ట్రేషన్ ప్లాట్లపై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేసి రిజిస్ట్రేషన్లు పున ప్రారంభించాలని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ముఖ్య సలహాదారులు మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం  ఘట్కేసర్, బోడుప్పల్ మున్సిపల్ సర్కిల్ల పరిధిలోని పట్టా భూములు, రిజిస్ట్రేషన్ ప్లాట్లను తాజాగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో చేర్చడంపై మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి కాలనీల అధ్యక్షులు, కార్యదర్శులు, ఘట్కేసర్, మేడిపల్లి మండలాల పరిధిలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, ప్లాట్ కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జక్క వెంకట్ రెడ్డి, నాయకులు మాట్లాడుతూ, పట్టా భూము లు, రిజిస్ట్రేషన్ పూర్తయిన ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వేలాది మంది ప్రజలు, భూ యజమానులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంతో పాటు సాధారణ ప్రజలకు కూడా భారీ నష్టం జరుగుతోందని పేర్కొన్నారు.   ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి, ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ షడగొండ కరుణాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సామ సతీష్ రెడ్డి, రమేష్, శ్రీకాంత్ రెడ్డి, ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, మల్లారెడ్డి, అరుణ్, శశిధర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి పూర్ణచందర్,యాదగిరి, బిక్షపతి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.