11 June, 2026 | 3:11 AM

ప్రత్యేక గ్రామసభలో హెల్మెట్ల పంపిణీ

11-06-2026 12:00 AM

భిక్కనూర్, జూన్ 10 (విజయక్రాంతి): ప్రజా పాలనప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా భిక్కనూర్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ Ashish Sangwan పాల్గొన్నారు. గ్రామ ప్రజల సమస్యలు, అభివృద్ధి అవసరాలు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించి వినతులు స్వీకరించారు.

గ్రామంలో ఉన్న పూరిగుడిసెలను గుర్తించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమం ద్వారా ఓటరు జాబితా సవరణలు చేపడుతూ అర్హులైన యువతను ఓటర్లుగా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. జన సంరక్షణమన సంరక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వేల సంఖ్యలో కందకాలు తవ్వినట్లు పేర్కొన్నారు.

గ్రామాల్లో విద్యుత్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించి సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా అదనపు ఎస్పీ Narsimha Reddyతో కలిసి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.వి. గిరి, సర్పంచ్ రేఖ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.