ఎర్రుపాలెం సొసైటీలో జీలుగు విత్తనాలు పంపిణీ
ఎర్రుపాలెం జూన్ 1 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఎర్రుపాలెం సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం నాడు రైతులకు జీలుగు విత్తనాలు పంపిణీ చేశారు. సొసైటీ చైర్మన్ మూల్పూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిలుగుల విత్తనాలను మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు ప్రారంభించి రైతులకు అందించారు.
కార్యక్రమంలో ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామక్రిష్ణ, మండల ఏవో సాయి శివ, ఎర్రుపాలెం ఏ ఈ ఓ బాలక్రిష్ణ మండల ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ కడియం శ్రీనివాసరావు, మండల సీనియర్ నాయకులు వెంకటాపురం సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి, ఎర్రుపాలెం సర్పంచ్ నండ్రు అశ్వినీ, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు లక్ష్మీపురం సర్పంచ్ తలపురెడ్డి నాగిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుడేటి బాబూరావు, జిల్లా కార్యదర్శి & ఆత్మకమిటి డైరెక్టర్ కంచర్ల వెంకట నరసయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జానీ బాషా, యూత్ కాంగ్రెస్ నాయకులు దేవరకొండ రాజీవ్ గాంధీ, క్లస్టర్ ఇంచార్జ్ లు శీలం వెంకట రామిరెడ్డి, నందిగం సందీప్, చొప్పకట్లపాలెం సర్పంచ్ బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి, అయ్యవారిగూడెం సర్పంచ్ కలసాని నాగరాజు, మండల సీనియర్ నాయకులు బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి, సామినేని హనుమంతరావు, గుర్రాల పుల్లారెడ్డి, మొగిలి అప్పారావు, దేవరకొండ వెంకట రత్నం, పురుషోత్తం రాజు, దోమందుల నాగేశ్వరరావు, బుసుపల్లి తిరుమల రెడ్డి, మేరీ చెన్నయ్య, వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు నాయకులు పాల్గొన్నారు.






