13 August, 2026 | 2:20 AM

విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన, వసతి, భోజనం అందించాలి

13-08-2026 01:33 AM

ఇనుగుర్తి, ఆగస్టు 12 (విజయక్రాంతి): ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన, భోజనం, వసతి కల్పించాలని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కోరారు. ఇనుగుర్తి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు అందుతున్న ఆహారం, మౌలిక వసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ప్రిన్సిపల్  జయశ్రీ, ఉపాధ్యాయులతో పాఠశాలలో సమస్యలు, ఇతర అంశాలపై చర్చించారు. అనంతరం బైపాస్ సర్జరీ చేయించుకుని, ఇంట్లో విశ్రాంతి పొందుతున్న గ్రామ బీ ఆర్ ఎస్ అధ్యక్షుడు బేతమల్ల చంద్రయ్యను పరామర్శించారు.