5 August, 2026 | 2:41 AM

ఉచిత కంటి అద్దాల పంపిణీ

05-08-2026 12:51 AM

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 4 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో బి ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కండ్ల అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదవారి ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించామని తెలిపారు.

ఆర్థిక ఇబ్బందుల వల్ల వైద్యానికి దూరమవుతున్న వారికి ఈ శిబిరం ద్వారా అవసరమైన మందులు, ఉచిత సేవలు అందించామన్నారు. శిబిరానికి ఉప్పరిగూడ, యాచారం, అబ్దుల్లాపూర్ మెట్/తుర్కయంజాల్ మున్సిపాలిటీ నుంచి వచ్చిన 406 మందికి ఉచిత కంటి అద్దాల పంపిణీ, 15 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఉప్పరిగూడ సర్పంచ్ బోసుపల్లి వేణి నందకుమార్, బూడిద నర్సింహారెడ్డి, మడుపు గోపాల్, పూన్నం రాము, మంగ ఐలేష్, శ్రీనాథ్, బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.