11 May, 2026 | 11:57 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ

27-02-2026 12:00 AM

నాగిరెడ్డిపేట్,ఫిబ్రవరి 26 (విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను నాగిరెడ్డిపేట్ మండలంలోని తాండూర్,పల్లెబోగుడ తండా గ్రామాలతో పాటు ఆయా గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు గురువారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి  గ్రామ సర్పంచులు ధనావత్ పార్వతీశంకర్,యాదవ్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దివిటీ కిష్టయ్య తెలిపారు.ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి దివిటీ కిష్టయ్య మాట్లాడుతూ...

స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశానుసారం మండలంలోని 11 గ్రామాలలో  17,01,972 రూపాయల 17 చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు.దీనితో లబ్ధిదారులు స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు అత్యవసర సమయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందించినందుకు ఎమ్మెల్యేకు ఎంతగానో రుణపడి ఉంటామన్నారు.

పేద ప్రజలను గుర్తించి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాండూర్, పల్లె బోగుగూడ తండా గ్రామ సర్పంచ్లు యాద గౌడ్,ధనావత్ పార్వతీశంకర్, కాంగ్రెస్ నాయకులు సంజీవులు, వేముల సంగయ్య, మధు, మునిగేపల్లి సంగయ్య,సన్నీ, బన్సీ, శంకర్ పాల్గొన్నారు.