2 September, 2026 | 5:37 PM

విద్యార్థులకు దుస్తులు, షూస్ పంపిణీ

02-09-2026 | 03:43pm

కంగ్టి, సెప్టెంబర్ 2(విజయక్రాంతి): కంగ్టి మండలం చాప్టా కే గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు, షూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ శివాజీ రావు విద్యార్థులకు దుస్తులు, షూస్ అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సర్పంచ్ ఆకాంక్షించారు. విద్యార్థుల సంక్షేమానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ఆయిషా సిద్ధిఖా, ఉపాధ్యాయులు ఎండీ అజీమొద్దీన్, గీతతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు దుస్తులు, షూస్ అందడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు.