20 May, 2026 | 2:40 AM

అంగన్వాడీకి కుర్చీల పంపిణీ

20-05-2026 01:20 AM

జుక్కల్, మే 19 (విజయక్రాంతి): మండలంలోని పెద్ద ఏడికి గ్రామానికి చెందిన అరుణ్ శ్వేత దంపతులు కూతురు అద్వైత పుట్టినరోజును వేడుకలు, ఆడంబరాలకు పోకుండా పలువురికి ఆదర్శంగా నిలిచారు. మంగళవారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రత్యేక వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని చిన్నారి పిల్లల సౌకర్యార్థం  తమ స్వంత ఖర్చులతో 25 కుర్చీలను కొనుగోలు చేసి, అంగన్వాడీ సిబ్బందికి అందజేశారు. అనంతరం అంగన్వాడీ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి, వారికి మిఠాయిలు పంపిణీ చేసి పుట్టినరోజు వేడుకలను జరిపారు.

ఈ సందర్భంగా అద్వైత తల్లిదండ్రులు మాట్లాడుతూ మా కుమార్తె అద్వైత పుట్టినరోజును ఇలా అంగన్వాడీ కేంద్రంలోని ముద్దులొలికే చిన్న పిల్లల మధ్య, వారికి ఉపయోగపడే వస్తువులను అందిస్తూ జరుపుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని, తృప్తిని ఇచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లల పుట్టినరోజుల సందర్భాల్లో ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినోద్ (మాజీ సర్పంచ్), సర్పంచ్ అనిల్, అంగన్వాడీ టీచర్లు ప్రమీల, యమున,  వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు  చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.