8 March, 2026 | 12:54 PM

చిట్టీల పేరుతో మోసం

08-03-2026 12:31 AM

ప్రజలన ముంచిన కి‘లేడీ‘లు

మోసపోవద్దంటూ బాధితుల వాల్ పోస్టర్ల ప్రదర్శన

నాగర్‌కర్నూల్ జిల్లా నడిగడ్డలో ఘటన

నాగర్‌కర్నూల్, మార్చి 7 (విజయక్రాంతి): చిట్టీల పేరుతో తమను నమ్మించి లక్షల్లో డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసిన మహిళలు ఈ గ్రామంలోనే అమాయకత్వ ముసుగు వేసుకొని తిరుగుతున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ బాధితులు వాల్ పోస్టర్స్ ప్రదర్శించారు.

ఈ ఘటన నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం నడిగడ్డ గ్రామంలో శనివారం వెలుగు చూసింది. హైదరాబాద్ మెహదీపట్నం ప్రాంతానికి చెందిన ఎర్రోళ్ల రెబెక, సాయి సుకిత్, దివాకర్, వెంకటేశ్వరరెడ్డి, స్టెల్లా అనే వ్యక్తులు ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ ఉన్నత చదువులు, అవసరాల కోసం చిట్టిల వ్యాపారం చేస్తున్న మహిళల వద్ద చిట్టి వేసుకున్నారు. చిట్టి పూర్తయ్యేంత వరకు డబ్బులు కట్టించుకున్న ఆ మహిళలు.. ఆ తర్వాత ముఖం చాటేయడంతో బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అయినా న్యాయం జరగకపోవడంతో శనివారం తెలకపల్లి మండలం గడ్డంపల్లి గ్రామంలోని సదరు మహిళల ఇంటి వద్దకు చేరుకొని తమ డబ్బులు తమకు ఇవ్వాలని వేడుకోగా వారిపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ మహిళ ఫోటోలతో సహా పూర్తి వివరాలను నమోదు చేస్తూ గ్రామంలోని ప్రతి ఇంటికి గోడపత్రికలను బాధితులు అంటించారు. ‘వీరిని నమ్మి లక్షలు పోగొట్టుకున్నాం హైదరా బాద్ ప్రాంతంలోని చాలామంది ఉద్యోగులు నిరుద్యోగుల వద్ద కోట్ల రూపాయలు చిట్టిల పేరుతో పోగుచేసుకొని ఇక్కడికి మాఖం మార్చారు. ని మీరు మోసపోవద్దంటూ’ ప్రచారం నిర్వహించారు.